ఇప్పుడు చెప్పలు కూడా శరీరంలో ఒక అవయవంతో సమానమే! చెప్పులు లేకుండా బయట అడుగు పెట్టలేం! పాదాలను కాపాడే చెప్పులకు కూడా ఒక చరిత్ర ఉందని మీకు తెలుసా... మనిషి సుదీర్ఘ ప్రయాణంలో చెప్పులు చేసిన సాయం కూడా చెప్పుకోదగ్గదే!
మనిషి నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచే అసలు జీవపరిణామం మొదలైంది.. ఆ ప్రయాణమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. చేపలాగా ఈదాలని నీళ్లలో దూకాడు, మునిగాడు.. తేలాడు,మొత్తానికి ఈత నేర్చుకున్నాడు. ఇప్పుడు చేపనే మించిపోయాడు. పక్షిలాగ ఎగరాలనుకున్నాడు.. ఎగిరాడు, కింద పడ్డాడు... లేచి నిలబడ్డాడ, రెక్కలు కట్టుకుని పక్షికన్నా ఎత్తుకి ఎగిరాడు. కోతులను చూసి, చెట్లు, గుట్టలు ఎక్కడం నేర్చుకున్నాడు.ఇంకా తనతో కలిసి జీవించే ప్రతి జంతువులోనూ ఏ క్వాలిటీ ఉన్నాదాన్ని తనలోకి ఇముడ్చుకున్నాడు.
గుహల్లో దాచుకుంటున్నప్పుడే
ఆది మానవుడు గుహల్లో నివసించేవాడు. అడవి పొదల్లో... రాళ్ల దప్పల మధ్య సాగేది అతని ప్రయాణం... తిండి కోసం ఒక రోజు జింకను తరుముతూ వెళ్లాడు. 1. అది రాళ్ల గుట్టలను.. ముళ్ల కంపలను దాటుకుంటూ వేగంగా పరుగెత్తింది. చివరికి అది ఆదిమానవుడికి దాతి కత్తికి చిక్కింది. రక్తమోడుతూ గిలగిలా కొట్టుకుంటోంది. కిందకి చూస్తే, అతని పాదాలు కూడా రక్తమోడుతున్నాయి. జింకకు చేసిన గాయం నుంచే రక్తం వస్తోంది. కానీ, దాని కాళ్లకు మాత్రం ఏం కాలేదు. 'జింక వెళ్లిన దారిలో.. అది అడుగులు వేసిన చోటే కదా అడుగులు కూడా పడ్డాయి... దానికేం కాలేదు. ఎందుకు?" అని జింక కాళ్లు పట్టుకుని చూశాడు. దాని కాళ్లకు గిట్టలున్నాయి. అవి గట్టిగా ఉన్నాయి. మరి తనకే గిట్టలు లేవు. తన పాదాలను రక్షించుకోవడానికి గిట్టల్లాంటివి కావాలనుకున్నాడు.జంతువుల చర్మాన్ని కుట్టి తొడుక్కొని చూశాడు... పరిగెత్తాడు. ఉరికినప్పుడు కలిగే రాపిడి వల్ల కాళ్లకు బొబ్బలు వచ్చాయేమో... మెత్తగా ఉండేలా లోపల గడ్డిపెట్టి జంతు చర్మంతో చెప్పులు కుట్టాడు. అవే మనిషి వాడిన మొదటి చెప్పులు అనుకోవచ్చు.
పాత లెదర్ బూటు ఇదే
లోహ యుగం నాటి మనుషులు చెప్పులు. వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం వేల ఏళ్ల అప్పుడు వాడిన చెప్పును పురావస్తు శాఖ సంపాదించింది. ఇది 2010లో అర్మేనియా గుహల్లో తవ్వకాలు జరిపినప్పుడు దొరికింది.. ఇది ఇప్పటి లేడిస్ ఏడో నంబర్ సైజు అంత ఉంది. ఇది అప్పటి మానవుడి కుడి కాలి బూటు, ఈ బూటు చుట్టూ గొర్రె పేడ ఉండటం. గుహ. మొత్తం చల్లగా ఉండటం వల్ల ఇప్పటి వరకు పాడవ్వకుండా ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.
"ఇది లోహ యుగం నాటికీ అప్పటి మనిషి ఎక్కువ దూరం అంటే కనీసం రోజుకు నలభై కిలోమీటర్లు నడిచేవాడు. అలా తన పాదాలను కాపాడుకునేందుకే బూట్లు తయారు చేసుకున్నాడు. ఇది 45 డిగ్రీల వేడినితట్టుకోగలవు" అది ఇప్పటి షూనే పోలి ఉండటం గమనార్హం. ఇక నది తీరాల్లో వెలసిన గ్రీకు లాంటి నాగరికతల్లో మనుషులు చెప్పులు వాడలేదు. మెత్తని మైదాన ప్రదేశంలో ఉండటం వల్ల వాళ్ల పాదాలకు చెప్పుల అవసరం కలగలేదు.
చెప్పులు.. వివక్ష
రాజుల కాలంలో కేవలం రాజులు, ధనవంతులు, సైనికులు అధికారం అనుభవించే వాళ్లు మాత్రమే చెప్పులు తొడుక్కునేవాళ్లు.. ప్రాచీన రోమన్లు చెప్పులు, బట్టలు వేసుకోవడాన్ని సొసైటీలో ఒక స్టేటస్ గా భావించేవాళ్లు. కొనుక్కొని తీసుకొచ్చిన బానిసల్ని, పేదవాళ్లను చెప్పులే కాదు మంచి బట్టల్ని కూడా తొడుక్కోనిచ్చేవాళ్లు కాదు రోమన్లు. బర్జీలు, ప్రాసిక్యూటర్లు బానిసల ఓనర్లు, అధికారులు మాత్రమే అప్పుడు చెప్పులు వేసుకునే వాళ్లు.. ఎవరైనా వాళ్ల ముందు చెప్పులు తొడుక్కుంటే శిక్షించేవాళ్లు.
ఈ వివక్ష 18వ శతాబ్దం వరకు కొనసాగింది. మన దేశంతో పాటు కొన్ని దేశాల కల్చర్లో ఇంట్లోకి, గుళ్లోకి వెళ్లే ముందు చెప్పులు విడిచి వెళ్లేవారు. పెద్ద కులాల వాళ్ల ముందు చెప్పులు విడిచి పట్టుకుని వెళ్లాలనే దురాచారం మన దగ్గర ఉండేది. ఆ వివక్ష చాలా ఏళ్లు కొనసాగింది. యూరప్లో కూడా అధికారం, డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే చెప్పులు వేసుకునేవాడు ఇక్కడ కూడా బానిసలు,పేదవాళ్లు చెప్పులు లేకుండానే జీవితం గడిపారు. ఈ పరిస్థితి 15వ శతాబ్దం వరకు ఉంది.
ఈ చెప్పులు ఈజిప్టుల సృష్టి
ఆదిమానవప్పుడు జంతువుల చర్మంతో చెప్పులు కుట్టుకునేవాడు. అయితే, నాగరిక ప్రపంచంలో మొదటిసారిగా చెప్పులను తయారుచేసింది మాత్రం ఈజిప్షియన్సే.. వాళ్లు 'పాపిరస్ అనే చెట్టు బెరడును కత్తిరించి, అరికాళ్లకు నాడాలా కట్టుకునే వాళ్లు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చెప్పుల రూపం ఈజిప్టులో రూపుదిద్దుకున్నదే.
ఇక, చెప్పులకు పూర్తి రూపాన్ని ఇచ్చింది మాత్రం యూరప్ లో ఉండే క్రిస్టియన్స్, యూరప్ దేశాలకు చెందిన క్రిస్టియన్స్ మధ్యయుగంలో ముస్లిం ఆధీనంలో ఉన్న పవిత్ర భూములను తిరిగి స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు. వీళ్లు కాలినడకనే ఏళ్లపాటు విరామం లేకుండా యుద్ధాలు చేసే వాళ్లు అలాంటి పరిస్థితిలో పాదాలను రక్షించుకోవడానికి చాలాకాలం మన్నేలా చెప్పులు తయారుచేసుకున్నారు. తర్వాత కాలంలో చెప్పుల రూపం, చెప్పులకు వాడే పదార్థం కూడా మారుతూ వచ్చింది. కొన్నాళ్లు చెక్కతో చేసిన చెప్పులు తొడుక్కున్నారు. కొంతకాలానికి చెక్కల ప్లేస్లో లోహాలు వచ్చి చేరాయి. తర్వాత నెమ్మదిగా ఇంగ్లండ్, ఇటలీ, ఫ్రాన్స్లో ఎట్రాక్టివ్ మోడల్స్ స్టార్ట్ అయ్యాయి. 15వ శతాబ్దంలో వచ్చిన 'చొపిన్స్' లేడిస్ హైహీల్స్ షూ వెనీస్లో ట్రెండ్ ఇయ్యాయి. ఇవి ఏడు నుంచి ఎనిమిదీ ఇంచుల ఎత్తులో ఉండేవి.
16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాణి కేథరిన్ డీ ఈ హై హీల్స్ వేసుకోవడంతో వాటికి క్రేజ్ వచ్చింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాయల్ లేడీస్ వాటిని తొడగడం స్టార్ట్ చేశారు. వీటితో పొడవుగా కనిపిస్తాం. రాయల్ లుక్ ఉంటుంది' అని వాళ్లు అనుకునేవాళ్లు. ఇప్పుడు మనం వాడుతున్న చెప్పులు లెదర్, ప్లాస్టిక్, రబ్బర్ తో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు చేతులతో కుట్టే చెప్పులను ఇప్పుడు అనేక డిజైన్లలో మెషిన్ తో తయారు చేస్తున్నాయి. సైనికులకు ఒక రకమైన బూట్లు, గుట్టలు ఎక్కేవాళ్లకు ఒక రకమైన బూట్లు, ఆటలు ఆడేవాళ్లకు ఒక రకమైన బూట్లు ఇలా చెప్పులు. శాండిల్స్, షూస్ అవసరానికి పరిస్థితులకు తగినట్టు తయారు చేస్తోంది ఫ్యాషన్ ప్రపంచం.