Bigg Boss: బిగ్బాస్ లోకి వైల్డ్కార్డ్‌తో 8 మంది మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్.. గంగవ్వతో పాటు మరో ఏడుగురు వీళ్లే!

Bigg Boss: బిగ్బాస్ లోకి వైల్డ్కార్డ్‌తో 8 మంది మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్.. గంగవ్వతో పాటు మరో ఏడుగురు వీళ్లే!

బిగ్బాస్ (Bigg Boss)..ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో ఉంచి..వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి, టాస్కుల పేరుతో వాళ్ళల్లో వాళ్లకె గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ.

ఇప్పటికే ఏడు సీజన్‌లు దుమ్ముదులిపేశాయ్. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ (Bigg Boss Telugu Season 8) కూడా రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1 స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 8.. ప్రస్తుతం ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌ తో ఆసక్తికరంగా మారింది. 

అయితే.. బిగ్ బాస్ సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒక్కో వారం చొప్పున ఇప్పటికీ నలుగురు కంటెస్టెంట్స్ వారిలో వరసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇవాళ గురువారం (అక్టోబర్ 3న) జరిగే ఎపిసోడ్లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడం చూపించే ఛాన్స్ ఉంది. ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ లో అవుట్ అవుతుండగా..సాధారణ వీక్ లో భాగంగా మరొకరు ఎలిమినేట్ అవుతారు. దీంతో మొత్తంగా బిగ్బాస్ హౌస్ లో మిగిలేది 8 మంది ఇంటి సభ్యులు మాత్రమే. కాగా బిగ్ బాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. 

ALSO READ | Bigg Boss Elimination: హౌజ్లో ఊహించని ట్విస్ట్.. మిడ్ వీక్లో మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్!

అదేంటంటే..ఈ సీజన్‌ 8లో ఇదివరకే జరిగిన (పాత సీజన్స్‌) లోని మాజీ కంటెస్టెంట్స్‌ను కూడా రంగంలోకి దింపనున్నారు. వారిలో 8 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గంగవ్వ, హీరో గౌతమ్ కృష్ణ, హరితేజ, మెహబూబ్ షేక్, జబర్దస్త్ రోహిణి, నయని పావని, టేస్టీ తేజ, జబర్దస్త్ అవినాష్ ఉన్నారు. వీరిలో మెహబూబ్ షేక్, గంగవ్వ, జబర్దస్త్ ముక్కు అవినాష్ ముగ్గురు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్. అయితే, గంగవ్వ సీజన్ 4లో అనారోగ్యం కారణంగా స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా  వైల్డ్కార్డ్‌ ఎంట్రీస్లో  సీజన్ 7 నుంచి ముగ్గురు ఉన్నారు. 

అవినాష్, టేస్టీ తేజఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తే అటు మిగతా కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ "ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు" అనే ట్యాగ్ కి..ఈ ఇద్దరు పూర్తి న్యాయం చేస్తారని టాక్.