మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే మమతా మీనా 2023 సెప్టెంబర్ 21 గురువారం రోజున ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు చచౌరా స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె మూడు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.
ఆప్‌లో చేరడం ఆనందంగా ఉందని, పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని మమతా మీనా చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ప్రజలు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్నారని ఈ సారి ఆప్‌కి అవకాశం ఇవ్వాలని మీనా కోరారు.
आज दिल्ली के मुख्यमंत्री एवं @AamAadmiParty के मुखिया आदरणीय @ArvindKejriwal जी के समक्ष मैंने और साहब श्री @RSMeenaIPS जी ने आम आदमी पार्टी की सदस्यता ग्रहण की।#AAPkiMamta @SandeepPathak04 pic.twitter.com/LIX1M2vTzx
— Mamta Meena (@MamtaMeenaBJP) September 21, 2023
మీనా 18 ఏళ్లుగా ఎంపీ రాజకీయాల్లో ఉన్నారు. 2018లో ఆమె చచౌరా నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో 9 వేల 797 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ లిస్టులో మీనా పేరు లేదు.