బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ఇటీవల ఎంపీ గా గెలిచిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే ఆమెకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కంగనా చెంప చెళ్లుమనిపించింది. గత రెండు రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో కంగనా ఖలీస్థానీ ఉద్యమంపై చేసిన కామెంట్స్ కారణంగానే ఆ అధికారి ఆమెపై చేయిచేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కొందరు ఆ మహిళా అధికారికి సపోర్ట్ చేస్తుంటే.. కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనకు అండగా నిలబడుతున్నారు. తాజాగా కంగనా రనౌత్ మాజీ ప్రియుడు బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ కూడా ఆమెకు మద్దతు తెలిపాడు. ఇందులో భాగంగా ఆయన సీఐఎస్ఎఫ్ అధికారికి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్‌కి లైక్ కొట్టాడు.
ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. కారణం ఏంటంటే.. గతంలో కంగనా-హృతిక్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే. కానీ, కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఆ విషయం పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. అలాంటిది.. ఈ విషయంలో హృతిక్ కంగనాకు సపోర్ట్ చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.