ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం: విచారణకు హాజరైన మరో మాజీ ఎమ్మెల్యే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు జైపాల్ యాదవ్ కు నోటీసులు జారీ చేయగా.. శనివారం ( నవంబర్ 16, 2024 ) జూబ్లీహిల్స్ ఏసిపి ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు జైపాల్ యాదవ్ ను విచారిస్తున్నారు.ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారించారు పోలీసులు. ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితుల సెల్ఫోన్లను విశ్లేషించారు పోలీసులు.

నిందితుల సెల్ఫోన్లలో లభించిన ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.

Also Read : ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి