పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్​పై తీర్పు రిజర్వు...విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు 

హైదరాబాద్/కొడంగల్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు, కొడంగల్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పిటిషన్​పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. లగచర్ల దాడి కేసులో ఈ నెల 13న కొడంగల్‌‌‌‌‌‌‌‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ రిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులను రద్దు చేయాలని నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి దాఖలు చేసిన క్రిమినల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారించారు. పార్కులో వాకింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారని, కింది కోర్టు యాంత్రికంగా రిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాలని నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ గండ్ర మోహన్‌‌‌‌‌‌‌‌రావు వాదించారు.

రాజకీయ కుట్రతోనే పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. అయితే, అధికారులపై దాడికి రైతులను నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఉసిగొల్పారని పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌ పల్లె నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు ప్రతివాదన చేశారు. కాగా, నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అరెస్టు తీరుపై హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పరారీలో లేనప్పుడు కేబీఆర్‌‌‌‌‌‌‌‌ పార్కులో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. ఇంట్లోనే అరెస్టు చేశామని పీపీ చెప్పగా.. అదే నిజమైతే ఆయన భార్య, పిల్లలు లేదా ఇంట్లో ఉండే ఇతర కుటుంబసభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడిగింది. వాకింగ్‌‌‌‌‌‌‌‌ కు వెళ్లినప్పుడు అరెస్టు చేయడానికి నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఏమైనా టెర్రరిస్టా అని నిలదీసింది. అరెస్టు నిబంధనలను పోలీసులు ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే, లంచ్‌‌‌‌‌‌‌‌ తర్వాత జడ్జి ఎదుట పీపీ హాజరై.. పోలీసుల వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని, రిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులను రద్దు చేయొద్దని కోరారు. రాతపూర్వక అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో విచారణను జడ్జి గురువారానికి వాయిదా వేశారు.

కస్టడీ పిటిషన్​పై రేపు తీర్పు

నరేందర్​రెడ్డి కస్టడీ పిటిషన్​పై బుధవారం కొడంగల్​కోర్టులో విచారణ పూర్తయింది. 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​లో ఉన్న నరేందర్​రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి బుధవారం భారీ బందోబస్తుతో పోలీసులు కొడంగల్​కోర్టుకు తీసుకువచ్చారు. నరేందర్​రెడ్డి తరఫున సీనియర్​అడ్వకేట్​మధుసూదన్​రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కొడంగల్​జూనియర్​సివిల్​జడ్జి తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం తీర్పును వెల్లడిస్తామని తెలిపారు. అలాగే, ఏ2 సురేశ్​రాజ్​కస్టడీకి కూడా కొడంగల్​కోర్టులో పోలీసులు పిటిషన్​దాఖలు చేశారు.