లాడర్‌హిల్: మాజీ చాంపియన్ శ్రీలంక, నేపాల్‌కు టీ20 వరల్డ్ కప్‌లో చుక్కెదురైంది. గ్రూప్–డిలో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చెరో పాయింట్ దక్కించుకున్న ఇరు జట్లూ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టనున్నాయి. మరోవైపు ఈ గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా సూపర్–8 రౌండ్‌కు చేరుకుంది.
మూడు మ్యాచ్‌ల్లో ఒకే పాయింట్‌తో ఐదో స్థానంలో ఉన్న బంగ్లా సోమవారం తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఇందులో నెగ్గినా లంక తర్వాతి రౌండ్ చేరే చాన్స్ లేదు. నేపాల్ రెండు మ్యాచ్‌ల్లో ఒక పాయింట్‌తో నాలుగో ప్లేస్‌లో ఉంది. చెరో రెండు మ్యాచ్‌ల్లో రెండేసి పాయింట్లతో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఈ గ్రూప్ నుంచి మరో సూపర్–8 బెర్తు కోసం పోటీ పడుతున్నాయి.