జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ వాయిదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టులో.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ పై.. 2024, ఆగస్ట్ 20వ తేదీ కోర్టు విచారణ చేసింది. ఈ పిల్ ను విచారించిన హైకోర్టు.. కేసు విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 

ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. అందులో భాగంగా జగన్ పై ఉన్న కేసులను వేగంగా విచారించాలని హరిరామ జోగయ్య తరపున అతని లాయర్ కోర్టును కోరారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐకి కోర్టు నోటీసులు ఇవ్వటం జరిగిందని స్పష్టం చేసింది కోర్టు. పిటీషన్ పై విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది హైకోర్టు. 

జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే డిశ్చార్జ్ పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి.