ఏపీలో దారుణంగా ఓడిపోయిన వైసీపీకి.. అప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులు చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఎక్స్(ట్విట్) చేశారు.
జగన్ ఎక్స్ ఇలా :
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అంటూ ఎక్స్ ద్వారా కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి 48 గంటలు కాక ముందే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఎక్కడికక్కడ తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు ఊర్లు విడిచి వెళ్లిపోతున్నారు.