
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (ఫిబ్రవరి 19) సికింద్రబాద్ లోని పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఎర్రవళ్లి ఫామ్ హౌజ్ నుంచి నేరుగా పాస్ పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకునేందుకు మధ్యాహ్నం సికింద్రాబాద్ కార్యాలయానికి వెళ్లారు.
కేసీఆర్ వచ్చే నెలలో (మార్చిలో) అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న తన మనువడు హిమాన్షు వద్ద కొన్ని రోజులు ఉండనున్న సమాచారం. అందుకోసమే పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకుంటున్నారని టాక్.
సోమవారం (ఫిబ్రవరి 17) బీఆర్ఎస్ భవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా బుధవారం కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తారనే ప్రచారం జరిగింది. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, వ్యూహాలపై చర్చిస్తారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ కేసీఆర్ పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లి అటునుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.