విజయసాయిరెడ్డి స్థానం కోసం పోటాపోటీ: రేసులోకీ మాజీ సీఎం..

విజయసాయిరెడ్డి స్థానం కోసం పోటాపోటీ: రేసులోకీ మాజీ సీఎం..

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో అటు పార్టీలో ఇటు ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. విజయసాయి రాజీనామాతో వైసీపీ శ్రేణులు షాక్ లో ఉండగా.. ఆయన రాజీనామాకు గల కారణాలు అంతు చిక్కక ప్రత్యర్థి పార్టీలు సైతం ఒకరకమైన డైలమాలో పడ్డాయనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం అధికార కూటమిలో పోటీ నెలకొంది. అయితే.. ఈ స్థానం బీజేపీకే ఫిక్స్ అయినట్లు విజయసాయి రాజీనామా చేసిన మరుక్షణం నుండే ఊహాగానాలు వినిపించాయి. అంతే కాకుండా ఈ స్థానం హీరో చిరంజీవికి దక్కనుందని టాక్ వినిపిస్తోంది. సంక్రాతి సందర్భంగా ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో వేడుకలకు చిరంజీవి హాజరవ్వడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

ప్రస్తుతం ఈ రేసులోకి అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి స్థానం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే రాయలసీమలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే.. నాగబాబును మంత్రిని చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి.. జనసేన రేసులో లేనట్లే అని చెప్పాలి.

Also Read :- యూపీ లడ్డూ మహోత్సవంలో విషాదం..

టీడీపీ కూడా ఆ స్థానంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదని సమాచారం. దీంతో బీజేపీ ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను రాజ్యసభకు పంపితే.. రెడ్డి ఓటు బ్యాంక్ తమ వైపు మరింత ఎక్కువగా ఉంటుందని బీజేపీ నమ్ముతోందని సమాచారం.

మొత్తానికి విజయసాయి రాజీనామాతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మరి, బీజేపీ ఈ పరిణామాన్ని ఉపయోగించుకొని ఏపీలో బీజేపీ బలపడుతుందా..లేదా అన్నది వేచి చూడాలి.