ఆర్టీఏ ఆఫీసులో మాజీ సీఎం

ఆర్టీఏ ఆఫీసులో మాజీ సీఎం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​మాజీ సీఎం నల్లారి కిరణ్​కుమార్​రెడ్డి సోమవారం ఖైరతాబాద్​ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇటీవల ఆయన కొన్న ఇన్నోవా కారును రిజిస్ట్రేషన్​చేయించుకున్నారు. అధికారులు ఆ కారుకు టీజీ 09సి 9393 నంబర్​ను కేటాయించారు. అంతకు ముందు కిరణ్​కుమార్​రెడ్డికి జేటీసీ రమేశ్​కుమార్, ఆర్టీఓ పురుషోత్తంరెడ్డి స్వాగతం పలికారు.