ఓటమిని విజయానికి తొలి మెట్టుగా చేసుకొని ఢిల్లీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు షీలా దీక్షిత్ . 20 ఏళ్ల క్రితం యూపీ నుంచివచ్చా క, మొదటి పోటీలోనే ఆమెను పరాజయం పలకరించిం ది. అయినారెట్టిం చిన ఉత్సాహంతో పని చేసి ఆరు నెలలకే హస్తం పార్టీ స్టేట్‌ప్రెసిడెంట్ అయ్యారు. 1998నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ నినమోదు చేశారు. సీఎంగా హ్యాట్రిక్ కొట్టా రు. 15 ఏళ్లు ఓ వెలుగు వెలిగి,2013లో ఆప్ చేతిలో దెబ్బ తిన్నారు. ఆరేళ్ల గ్యా ప్ తీసుకుని ఈ జనవరిలో మళ్లీ ఢిల్లీ కాంగ్రెస్ పగ్గా లు చేపట్టా రు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉన్న ఈజనరల్ ఎలక్షన్ లో ఎలాం టి ఫలితాలను సాధిస్తారో?
రెండు దశాబ్దాల కిందట వణికించే శీతాకాలపు చలిలో 12వ లోక్‌సభ ఎన్నికల వేడి రగులుకుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో ఒకవైపు గజగజలాడించే చలి. మరోవైపు లోకల్ లీడర్లను గడగడలాడిస్తున్న బీజేపీ స్ట్రాంగ్‌మ్యాన్ లాల్ బిహారీ తివారీ. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఓ మహిళా నేత ఆయనతో ఎలక్షన్లో పోటీపడ్డారు. అందరూ ఊహించినట్లే ఓడిపోయారు. అయినా డీలా పడకుండా పడి లేచిన కెరటంలా దూసుకుపోయారు. ఆమే.. షీలా దీక్షిత్.
ఢిల్లీలో మొదటిసారి పోటీ చేసినప్పటికీ ఆమెను ఐదు లక్షల మందికి పైగా ఓటర్లు ఆదరించారు. అంతకుముందు ఏడాది జరిగిన ఎలక్షన్స్‌తో పోల్చితే కాంగ్రెస్ 20 శాతం ఎక్కువ ఓట్లు సాధించింది. దీంతో షీలా దీక్షిత్‌పై హస్తం పార్టీకి నమ్మకం కుదిరింది. ఢిల్లీలో పార్టీ భవిష్యత్ ఆమెతోనే సాధ్యమనే అంచనాకు వచ్చింది. ఆరు నెలలపాటు షీలా పనితీరును పరిశీలించి రాష్ట్ర శాఖ బాధ్యతలను అప్పగించింది. ఆమె కూడా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకున్నారు. 1998 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారీ విజయంతో రాష్ట్ర పాలన చేపట్టారు. షీలా కార్యదక్షతకు జనం జేజేలు పలికారు. కంటిన్యూగా మూడు దఫాలు 15 ఏళ్లపాటు ఢిల్లీ సీఎంగా కొనసాగారు. 2013 అసెంబ్లీ ఎలక్షన్లో ఆప్ చేతిలో ఓటమితో ఆరేళ్ల పాటు రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 17వ జనరల్ ఎలక్షన్స్ దగ్గరపడటంతో ఈ ఏడాది జనవరిలో మళ్లీ ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా తెర పైకి వచ్చారు. హస్తం పార్టీకి హస్తినలో పూర్వ వైభవం తెస్తారనే ఆశాభావం బాగా కనిపిస్తోంది.
వచ్చీ రావటంతోనే…
2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పెర్ఫార్మెన్స్తోపాటు, ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ చరిష్మా కారణంగా రాష్ట్రంలో హస్తం పార్టీ ప్రభావం నామమాత్రంగా మారింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీని గట్టెక్కించటానికి షీలా దీక్షిత్ వచ్చీరావటంతోనే ప్రయత్నాలు ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
పోయిన చోటే వెతుక్కోవాలంటారు కదా! షీలా దీక్షిత్ కూడా అదే చేస్తున్నారు. ఏ పార్టీ చేతిలోనైతే ఓడామో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవటం అసలుకే మోసమనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆప్‌తో అలయెన్స్‌కి ఆమె మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. చివరికి అదే జరిగింది. ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ సీట్లలోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఆప్ మాదిరిగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా వంటి పెద్ద పెద్ద అంశాల జోలికి వెళ్లడం లేదు. జాగ్రత్తగా ఆచితూచి ప్రచారం చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చెబుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక సీఎం కేజ్రీవాల్ పీఎం మోడీని కలిసి ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని అడిగారు. కానీ అది ఐదేళ్లయినా నెరవేరలేదు. దీన్ని షీలా దీక్షిత్ ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. కేజ్రీలాంటి మాజీ బ్యూరోక్రాట్‌తో ఏ పనీ జరగదన్న కోణంలో ప్రచారం చేస్తున్నారు. ఆరో ఫేజ్‌లో భాగంగా మే 12న ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సెగ్మెంట్లకూ పోలింగ్ జరగనుంది. త్రిముఖ పోటీతో అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తగా డీల్ చేసింది. ఈ వ్యూహాలు విజయానికి దగ్గరి దారులవుతాయో లేదో చూడాలి.
నార్త్ వెస్ట్ ఢిల్లీ
ఇది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ . మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ కి బదులు ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్ లిలోతియాకు ఇక్కడ టికెట్ ఇవ్వటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన జాతవ్ కమ్యూనిటీ కి చెందిన నాయకుడు. ఈ సెగ్మెంట్లో ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువమంది ఉన్నా రు. ఇది ఆయనకు ఫేవర్ గా పనిచేస్తుం ది.
ఈస్ట్ ఢిల్లీ
ఢిల్లీలోని సిక్కులు 2009లో మన్మోహన్ సింగ్ రిక్వెస్ట్ మేరకు కాంగ్రెస్ కి ఓటేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున అర్వీందర్ సింగ్ లవ్లీ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పోటీచేస్తున్న ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో ఈయన ఒక్కరే సిక్కు క్యాండిడేట్ . ఇది హస్తం పార్టీకి సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.అర్వీందర్ ఢిల్లీ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ కూడా.
చాందినీ చౌక్
సీనియర్ నేత జేపీ అగర్వాల్ సొంత సెగ్మెంట్.ఇక్కడి నుం చి 1984, 89 ఎన్నికల్లో గెలిచారు. మధ్యలో ఆరేళ్లు రాజ్యసభ ఎంపీగా వెళ్లి, 2009లో నార్త్ ఈస్ట్ ఢిల్లీకి షిప్టయి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈసారి మళ్లీ చాం దినీ చౌక్ ని అగర్వాల్‌కే ఇచ్చిం ది. 2004, 2009, 2014ల్లో కపిల్ సిబల్‌కి కేటాయించగా, ఆయన రెండు సార్లు గెలిచి, పోయిన ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ హర్షవర్థన్ చేతిలో ఓడిపోయారు. డీలిమిటేషన్ తర్వాత బనియా కమ్యూనిటీ పెరిగింది.
నార్త్ ఈస్ట్ ఢిల్లీ
అందరూ ఆసక్తిగా ఎదురుచూసే నియోజక వర్గాల్లో ఇదొకటి. ఢిల్లీ పీసీసీ చీఫ్ షీలా దీక్షిత్ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థులు మనోజ్ తివారీ (బీజేపీ), దిలీప్ పాండే(ఆప్) ఇద్దరూ కూడా తమ తమ పార్టీలకు స్టేట్ ప్రెసిడెంట్లు కావటం విశేషం. ఈ సెగ్మెంట్ లో పూర్వాంచల్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇందులో ఎక్కువ ఓట్లను ఎవరు పొందుతారో చూడాలి. త్రిముఖ పోటీ షీలా దీక్షిత్ కి కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు.
వెస్ట్ ఢిల్లీ
ఇది జాట్ ప్రాబల్యం గల నియోజకవర్గం.కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మహబల్ మిశ్రాకి టికెట్ ఇచ్చింది. బీజేపీ తరఫున సిట్టిం గ్ ఎంపీ పర్వే ష్ వర్మ, ఆప్ అభ్యర్థిగా బల్బీర్ సింగ్ పోటీలో ఉన్నా రు. ఇద్దరూ జాట్ లే. వీరిమధ్య జాట్ ఓట్లు చీలటం ఖాయం. ఇది తనకు ప్లస్ అవుతుందని హస్తం మిశ్రా అంచనా వేస్తున్నా రు. ఇక్కడి జాట్ల తర్వాత పూర్వాంచల్, సిక్కు, పంజాబీలు ఉన్నారు. సిక్కువర్గానికి చెందిన బలమైన నేత హెచ్ ఎస్ ఫూల్కా ..పార్టీని వీడటం మైనస్ పాయింట్.
న్యూఢిల్లీ
ఢిల్లీ కాంగ్రెస్ శాఖ మాజీ చీఫ్ అజయ్ మాకెన్ ఇక్కడ రంగంలో దిగారు. తన కమ్యూనిటీ(పంజాబీ) ఓటర్లతోపాటు గవర్నమెం ట్ ఎంప్లాయీస్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. మాకెన్ కృషి వల్లే ప్రభుత్వం 7వ వేతన సంఘాన్ని ప్రకటించిం ది. అది ఆయనకు ప్లస్ పాయింట్ . 2009లో ఆప్ తరఫున ప్రముఖ జర్నలిస్ట్ ఆశిష్ ఖేతన్ పోటీ చేసి ఓడినప్పటికీ దాదాపు మూడు లక్షల ఓట్లు పొందారు. ఆతర్వాత ఆ పార్టీ నుం చి వెళ్లిపోయారు.
సౌత్ ఢిల్లీ
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్దోషిగా తేలి జైలుకెళ్లటంతో ఈ నియో జకవర్గంలోకాంగ్రెస్ కి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఆయన లేనిలోటును భర్తీ చేయటం పార్టీకి కష్టం గా మారిం ది. అయి-నప్పటికీ జాట్ కుల పెద్ద భూపిందర్ హూడా సలహాలూసూచనలతో బాక్సర్ విజేందర్ సింగ్ ని ఎంపిక చేసింది.