దొంగలను దోచుకున్న మాజీ కానిస్టేబుల్ హత్య

దొంగలను దోచుకున్న మాజీ కానిస్టేబుల్ హత్య
  • దొంగసొత్తు పంపిణీలో వివాదమే కారణం
  • కారుతో ఢీకొట్టిన దొంగలు
  • చికిత్స పొందుతూ మృతి
  • నేరచరిత్ర కారణంగా2022లో ఊడిన ఉద్యోగం

హైదరాబాద్‌‌‌‌/ఎల్బీనగర్, వెలుగు:దొంగలతో స్నేహం చేసిన మాజీ కానిస్టేబుల్‌‌‌‌  అదే దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు. దోచుకున్న సొత్తు వాటాల పంపిణీలో తలెత్తిన వివాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో శనివారం ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు చెందిన మేకల ఈశ్వర్  2010లో కానిస్టేబుల్‌‌‌‌గా పోలీస్  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చేరాడు. హైదరాబాద్  సిటీ కమిషనరేట్‌‌‌‌  పరిధిలోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ‌‌‌‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట పోలీస్  స్టేషన్లతో పాటు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లోనూ విధులు నిర్వహించాడు. వివిధ కేసుల్లో అరెస్టయిన దొంగలతో స్నేహం చేసుకున్నాడు. దొంగలు చోరీచేసి తెచ్చిన సొత్తులో తన వాటా తీసుకునేవాడు.

పిక్‌‌‌‌ పాకెటింగ్‌‌‌‌, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, చైన్ స్నాచింగ్స్‌‌‌‌, ఇళ్లలో చోరీలు చేసే పాత నేరస్తులను బెదిరించేవాడు. వారి వద్ద అందిన కాడికి  దోచుకునేవాడు. స్నాచర్లు దొంగిలించి తెచ్చిన సెల్‌‌‌‌ఫోన్లను తక్కువ ధరకు అమ్ముకునేవాడు. ఇలా పోలీసు యూనిఫామ్‌‌‌‌  ముసుగులో దొంగలతో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. దొంగలను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించాడు. వారికి టార్గెట్లు ఇచ్చి చోరీలు చేయించేవాడు. ఈ క్రమంలో 2022లో నల్గొండ పోలీసులకు చిక్కాడు. దీంతో ఈశ్వర్  నేరచరిత్ర బయటపడింది. దీంతో అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలిగించారు.

అయినా కూడా ఈశ్వర్  నేరాలు చేయడం ఆపలేదు. రాష్ట్రంలో నేరాలు చేస్తే దొరికిపోతానని చెన్నై, బెంగళూరులో చైన్  స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. కొంత మంది పాత నేరస్తులతో కలిసి దొంగల ముఠాకు నాయకుడిగా ఎదిగాడు. దీంతో ఇతర దొంగల ముఠాల నాయకులు ఈశ్వర్‌‌‌‌‌‌‌‌పై కక్ష కట్టారు. అతని అడ్డు తొలగించుకునేందుకు వారు ప్లాన్  చేశారు. ఇందులో భాగంగా సెటిల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ చేసుకుందామని చెప్పారు. ఈనెల 2న మీర్‌‌‌‌‌‌‌‌పేటలోని మందమల్లమ్మ చౌరస్తాలో కలుద్దామని అనుకున్నారు. ఈశ్వర్  సహా నలుగురు పాత నేరస్తులు అక్కడ మద్యం షాపులో మద్యం కొని సేవించారు.

చోరీలు, వాటాలకు సంబంధించి వారికి, ఈశ్వర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే ఈశ్వర్‌‌‌‌‌‌‌‌పై కక్ష పెంచుకున్న ప్రత్యర్థి ముఠా సభ్యులు అతడిని కారుతో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు స్థానిక హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ శనివారం అతను మృతి చెందాడు. సరూర్ నగర్  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నలుగురిలో ఒకడు పట్టుపడ్డాడు.

శారీరక శ్రమ నుంచే పాట, నృత్యం పుట్టాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శులు, మాజీ ఎమ్యెల్సీ చంద్రశేఖర్ రావు, చెన్నమనేని వెంకటేశ్వర్ రావు, కోశాధికారి వి.చెన్నకేశవ రావు, ఎన్ఆర్ఆర్ పరిశోధన కేంద్రం సభ్యులు దేశిని లక్షీనారాయణ, జోష్యభట్ల క‌‌‌‌‌‌‌‌ల్పన, క‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌ర్తి జ్యోష్నా, కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.