తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నాయకులను లక్షలు ఇచ్చి కొంటున్నారు. తాజాగా భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశాడు మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్. తాను పార్టీ మారితే 25 లక్షల రూపాయల ఇస్తానని తనకు ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డి ఆఫర్ చేశాడని మీడియా ఎదుట చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే 30 లక్షలకు బేరం.. 5 లక్షలు అడ్వాన్ ఇచ్చిన భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి. నోట్ల కట్టలను మీడియాకు చూపించిన భువనగిరి మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనీల్#BRSparty #Congressparty #TelanganaElections2023 pic.twitter.com/ZWznHQS1nw
— raghu addanki (@raghuaddanki1) November 21, 2023
అడ్వాన్సుగా 5 లక్షల రూపాయలు.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత రూ.25 లక్షలు ఇస్తానంటూ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆఫర్ చేశాడని మీడియా ఎదుట చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ప్రలోభాలకు గురి చేసిన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు పంపిన ఐదు లక్షల రూపాయల నోట్ల కట్టలను మీడియా ఎదుట చూపించడం సంచలనంగా మారింది.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే టికెట్ దక్కించుకున్న వేర్వేరు పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంక్షలు అమల్లో ఉన్నా విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు కొన్ని చోట్ల అయితే.. కుక్కర్లు, కుట్టు మిషన్లు, ఇతర వస్తువులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు.