రాబిన్ ఊతప్ప.. మాజీ క్రికెటర్ అండీ.. గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఈ మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. జారీ చేసింది ఎవరో తెలుసా.. ప్రభుత్వమే.. అవును.. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత.. రాబిన్ ఊతప్ప.. దుస్తుల కంపెనీ పెట్టారు. చొక్కా, ప్యాంట్స్ వంటి దుస్తులను తయారీ చేసే కంపెనీ. దీనికి ఇప్పుడు ఆయనే ఓనర్. కర్నాకటలో ఉంది అతని కంపెనీ. ఈ కంపెనీలో జరిగిన ఫ్రాడ్ వెలుగులోకి రావటంతో.. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సర్కార్.
రాబిన్ ఊతప్ప.. సెంటారస్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. దీనికి డైరెక్టర్ కూడా.. ఈ కంపెనీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్.. ప్రావిడెంట్ ఫండ్ బకాయి పడింది. 24 లక్షల రూపాయలను.. ఉద్యోగుల జీతాల్లో కట్ చేశాడు.. ఆ డబ్బును పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. ఈ విషయంపై కంప్లయింట్స్ రావటంతో.. పీఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో 24 లక్షల రూపాయల ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు.
ఈ అంశంపై పీఎఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీలోపు ఉద్యోగుల బకాయిలు 24 లక్షల రూపాయలు చెల్లించాలని.. లేనిపక్షంలో అరెస్ట్ చేస్తామంటూ వారెంట్ జారీ చేశారు. కొన్ని రోజులుగా ఈ అంశంపై అధికారులు అలర్ట్ చేస్తున్నా రాబిన్ ఊతప్ప పట్టించుకోవటం లేదంట. ఉద్యోగుల నుంచి కంప్లయింట్స్ కూడా రావటంతో.. అరెస్ట్ వారెంట్ తోపాటు నోటీసులు జారీ చేశారు అధికారులు.
ALSO READ : IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. నాలుగో టెస్టుకు ముందు రాహుల్‌కు గాయం
రాబిన్ ఊతప్ప క్రికెట్ కెరీర్ గురించి చూస్తే.. 59 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లోనూ ఆడాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత దుస్తులు బిజినెస్ స్టార్ట్ చేశాడు. డిసెంబర్ 4వ తేదీనే ఈ అరెస్ట్ వారెంజ్ జారీ అయ్యింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.