పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కారు పార్టీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. ఆరు నెలలుగా తనకు పార్టీ మానసిక అవేదన కలించిందని రాజయ్య చెప్పారు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నా తనను పట్టించుకోవడం లేదని రాజయ్య అన్నారు.
గత ఎన్నికల్లో రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించేందుకు నిరాకరించింది.ఈ క్రమంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పారని రాజయ్య వర్గం ప్రచారం జరిపింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది.