మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 'నన్ను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారు. సీఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద మీద యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్స వాలు కూడా జరిగినాయి. ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తుంది. ఇప్పుడే చీఫ్ సీఆర్వోను ఓఎస్టీ సారిని కదిలించినా. చిట్టి రాసిన.
మా చిన్నప్పుడు ఆడుక్కొనేటోడు ఇంటి ముందుకు వస్తే.. ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి ఎల్లవయ్య అని మెల్లగా చెప్పేటోళ్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నేళ్లు ఎవ్వరినీ కలవలే. ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయినవి. ఒక నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తారు అనుకున్న. 7 నెలలు కావొస్తోంది. అందుకే రిమైండర్ లెటర్, పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక నా వద్ద లేవు. అని నేను ఆ రోజే రేవం తన్నకు చెప్పిన" అని నళిని రేవంత్ కు లేఖ రాస్తూ పోస్టు చేశారు.