సాఫ్ట్‌వేర్ కంపెనీ MD, CEOని చంపిన మాజీ ఉద్యోగి

సాఫ్ట్‌వేర్ కంపెనీ MD, CEOని చంపిన మాజీ ఉద్యోగి

సాఫ్ట్‌వేర్ కంపెనీ CEO, MDని చంపిన మాజీ ఉద్యోగి

పగబట్టి.. పసిగట్టి చంపాడు
  
ఏరోనిక్స్‌ ఇంటర్నెట్‌ కంపెనీలో ఫణీంద్ర సుబ్రమణ్య(ఎండీ), విను కుమార్‌(సీఈవో) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో అదే కంపెనీలో పనిచేసిన ఫెలిక్స్‌ అనే మాజీ ఉద్యోగి.. కొన్నాళ్ల అనంతరం బయటకు వెళ్ళిపోయి సొంత వెంచర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్‌ ఇద్దరూ తన కంపెనీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫెలిక్స్ ఆగ్రహంతో ఉండేవాడు. వారిని ఎలాగైనా మట్టుబెట్టాలనే ఆలోచనతో ఉండేవాడు.

మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎండీ ఫణీంద్ర, సీఈవో విను కుమార్‌ ఇద్దరూ ఆఫీస్‌లో ఉండగా.. నిందితుడు ఆఫీస్‌లోకి ప్రవేశించి వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడినుండి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతిచెందారు. నిందితుడు ఫెలిక్స్‌ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్టు బెంగళూరు నార్త్‌ ఈస్ట్‌ డీసీపీ లక్ష్మీ ప్రసాద్‌ వెల్లడించారు. నిందితుడికి ఇదే తరహా వ్యాపారం ఉందని, అతని వ్యాపార వ్యవహారాల్లో కలగజేసుకోవడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోందని తెలిపారు.