కాళేశ్వరం ఆలోచన కేసీఆర్దే !

కాళేశ్వరం ఆలోచన కేసీఆర్దే !

* సీఎం సమీక్షకు పిలిచే వరకు మాకేం తెలియదు
* లొకేషన్ ఆధారంగా డీపీఆర్ లో మార్పులు
* కమిషన్ ఎదుట ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు
* నిరాధార వ్యాఖ్యలు చేయొద్దన్న కమిషన్
* డీపీఆర్ తయారీపైనే ప్రశ్నల వర్షం

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ పై ఇవాళ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ప్రశ్నించింది. నిజాలు మాత్రమే చెప్పాలని, డాక్యుమెంట్లను ఆధారంగా చూపాలని హెచ్చరిస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ ముందు నిరాధార వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాళేశ్వరం డీపీఆర్ తయారీ నిర్ణయం ఎవరు ఎప్పుడు తీసుకున్నారని అడగగా.. 2016లో అప్పటి ముఖ్యమంత్రి రివ్యూ ఏర్పాటు చేశారని, ఆయన ఆధ్వర్యంలో నిర్ణయం జరిగిందని చెప్పారు.

ALSAO READ | మూడు బ్యారేజీల్లో లోపాలున్నాయని..ముందే చెప్పినం

కాళేశ్వరం ఆలోచన గత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని చెప్పారు. ఆయన రివ్యూకు పిలిచే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తర్వాత మార్పులు జరిగాయా..? అని  ప్రశ్నించగా.?  సైట్ కండిషన్ ఆధారంగా మార్పులు జరిగాయని వివరించారు. ఎవరు మోడిఫికేషన్ చేశారన్న కమిషన్ ప్రశ్నకు.. హై పవర్ కమిటీ ఆదేశాల మేరకు చేశామని చెప్పారు. మూడు బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని వ్యాప్కోస్‌ సూచించిందన్నారు. ప్రభుత్వం, అధికారుల ప్రమేయం లేకుండానే వ్యాప్కోస్‌ ఎలా సూచిస్తుందని కమిషన్ ప్రశ్నించింది.