మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతితో జనగామ జిల్లా గిర్నితండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హైదరాబాద్ నుండి భారీ భద్రత నుడుమ ప్రీతి మృతదేహాన్ని ఇయ్యాళ ఉదయం గిర్నీతండాకు తరలించారు. ఆమె డెడ్ బాడీని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు గుండెల పగిలేలా రోదిస్తున్నారు. తమ బిడ్డను హత్య చేశారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రీతి మృతిపై రాష్ట్ర సర్కారు ఇప్పటివరకూ స్పందించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం నుంచి నిమ్స్ వరకు ప్రతీది డ్రామానే క్రియేట్ చేశారని మండిపడుతున్నారు. ప్రీతి మృతి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 90 రోజులలోపు నిందితుడికి శిక్ష విధించాలని కోరుతున్నాయి. బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రీతి స్వగ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా ప్రీతి అంత్యక్రియలు ఇయ్యాళ మధ్యాహ్నం గిర్నితండాలో జరగనున్నాయి.