బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కైలాష్ జోషి (90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం బన్సాల్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మరణించారు.. అస్తమా, షుగర్ తో జోషి బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు.
జోషి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన దేవాస్ జిల్లాలోని హత్పిపాల్యాలో జరగనున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. జోషి మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు సంతాపం తెలిపారు.