హైడ్రా మంచిదే.. శభాష్ రేవంత్: విద్యాసాగర్ రావు


హైదరాబాద్: తాను గవర్ గా ఉన్నప్పుడు ఐదుగురు ముఖ్య మంత్రులు తన కోసం వేయిట్ చేశారని.. కానీ సీఎం రేవంత్  రెడ్డిని రిసీవ్ చేసుకోవడం తన బాధ్యత అని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. 'సాంస్కృతిక జాతీయ వాదం అందరిలో ఉంది.. పార్టీలు వేరు కావొచ్చు. ఎల్లంపల్లికి శ్రీపాద రావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ. వాజ్ పేయిని ప్రధాన మంత్రి అవుతావని నెహ్రూ అన్నారు. 

ALSO READ | ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలే.. కౌశిక్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్

పాలక పక్షానికి, ప్రతిపక్షానికి పెద్దగా డిఫరెన్స్ లేదు.. అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న భారత జాతిని వదిలిపెట్టలేదు. హైడ్రాసు అందరూ పొగుడుతున్నారు.. హైదరాబాద్ నగరాన్ని సుందరంగా నిర్మించుకోవాలని ముందుకు వెళ్లడం మంచిది. మూసీ నదీని ప్రక్షాళన చేయాలి' అని సూచించారు.