
ఏపీ మాజీ మంత్రి.. మాజీ డిప్యూటీ సీఎం..వైసీపీ నేత అంజద్‌బాషా తమ్ముడు.. అహ్మద్ బాషాను ముంబైలో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి దంపతులను అసభ్యకరంగా దూషించారని వైసీపీ నేత అహ్మద్ భాషాపై కేసు నమోదైంది. గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిపై పోలిస్ స్టేషన్ లోనే దాడికి యత్నించారని కూడా కేసు నమోదైంది. అహ్మద్ భాషాపై రెండు కేసులు నమోదు కావడంతో.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన అఙ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కడప పోలీసులు ఆయనను ముంబైలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. సోమవారం ( ఏప్రిల్ 7) కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరు పరిచే అవకాశముంది.
ALSO READ | పాలనపై పట్టులేని రేవంత్ రబ్బర్ స్టాంప్ సీఎం: బండి సంజయ్