
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ స్కామ్ లో రూ. 370 కోట్ల దోపిడీతో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని చెప్పారు. వ్యవస్థను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. పాపం పండే రోజు వచ్చిందన్నారు. ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుందని చెప్పారు. తనకు ఏమీ లేదని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
చంద్రబాబు అరెస్టుతో టీడీపీ మరింత దిగజారిందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల్లో స్పందన కరువైందని తెలిపారు. అక్రమాల కేసుల్లో పూర్తి వివరాలు సేకరించిన తరువాతే అధికారులు కేసు నమోదు చేశారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు.