చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయ్యింది.. మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు..

ఏపీలో శ్వేతపత్రాల వార్ నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఇదివరకే పలు శ్వేతపత్రాలు విడుదల చేయగా, వాటికి కౌంటర్ వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు శ్వేతపత్రాలపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేసారు. చంద్రబాబు రిలీజ్ చేసింది శ్వేతపత్రాలు కాదని, సాకు పత్రాలు అని ఎద్దేవా చేశారు. సూపర్ 6 అమలు ప్రారంభం కాకుండానే డకౌట్ అయ్యిందని అన్నారు.

Also Read:-చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారట.. అందుకే అంత కోపం..

ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక డబ్బు ఎలా తేవాలని ప్రజలను అడగటం ఏంటని ప్రశ్నించారు బుగ్గన. పథకాలు అమలు చేయకుండా డేటా డేటా... అంటూ సత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసేందుకు వచ్చిన డేటా పథకాలు అమలు చేయటానికి ఎందుకు లేదని అన్నారు.

2014 నుండి 2019 వరకు చంద్రబాబు హయాంలో దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.4 ఉంటే తమ ప్రభుత్వ హయాంలో 4.82 శాతానికి చేరి 0.42శాతం పెరిగిందని స్పష్టం చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తూ బురదచల్లటం మానుకొని, ఇచ్చిన హామీలను అమలు చేయటం మీద దృష్టి పెట్టాలని అన్నారు బుగ్గన.