మాజీ మంత్రి హరీశ్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమలగిరి పీఎస్ ముందు రోడ్డుపైన హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, , వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తోపాటు పలువురు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పీఎస్ కు తరలించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ నవంబర్ 4న ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు మాజీ సర్పంచ్ లు. అయితే హైదరాబాద్ కు వెళ్లకుండా మాజీ సర్పంచ్ లను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు . జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు.