- విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా పట్టించుకోరా?
- మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్: పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లడానికే ప్రాధాన్యమిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్అయ్యారు. డెంగ్యూ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయమని అన్నారు. ‘డెంగ్యూ జ్వరాల బారినపడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
భుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. కానీ ప్రభుత్వం మా సూచనలను పెడచెవినపెట్టింది. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విష జ్వరాలు ఇంతగా విజృంభించేవి కావు. ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ముఖ్యమంత్రి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించలేదు.
మల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టలేదు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు’ అని హరీశ్ రావు ట్వీట్‌చేశారు.