పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళతాం : మాజీ మంత్రి హరీష్రావు

 పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళతాం : మాజీ మంత్రి హరీష్రావు

సంగారెడ్డి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నడు.. పార్టీ  పని అయిపోయింది అన్నరు..అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ ఎస్ పార్టీలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం  మహిపాల్ రెడ్డి ఏం తక్కువ చేసినం.. ఎందుకు కాంగ్రెస్ లోకి పోయిండు అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే కష్టాలు వస్తాయని.. భయపడి పార్టీ మారాడు అని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గానికి ఏది అడిగితే అది మంజూరు చేశారు. 

నిధుల వరద పారించామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మాజీలు  చేసే వరకు నిద్రపోమన్నారు హరీష్ రావు. మహిపాల్ రెడ్డి పార్టీ మారినా బీఆర్ ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. నియోజకవర్గానికి నేను అండగా ఉంటానన్నారు హరీష్ రావు.  ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు... ఇప్పుడు మాతర్ం ఆయనే ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. 

రుణమాఫీ పై జీవోను వెంటనే మార్చాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాటల్లోనే పాస్ బుక్ ప్రకారం అని అంటున్నారు.  కానీ జీవోల్లో మాత్రం తెల్ల రేషన్ కార్డు నిబంధన అంటున్నారు. రుణమాఫలో పీఎం కిసాన్, రేషన్ కార్డు నిబంధనతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ అందరికి రుణమాఫీ చేశారని .. ఇప్పుడు కూడా మునపటి పద్దతిలోనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. ఏడు నెలలుగా కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు తప్పా అన్ని తుస్సే అని అన్నారు. హమీలపై త్వరలోనే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని అన్నారు. ప్రభుత్వం తప్పులపై పోరాటం చేస్తామన్నారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.