కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేస్తుండ్రు : జోగు రామన్న

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేస్తుండ్రు : జోగు రామన్న
  • పత్తి విత్తనాలు అడిగితే లాఠీచార్జి చేస్తరా
  • ట్యాక్స్ ల  డబ్బులను ఢిల్లీకి పంపుతుండ్రు 
  • రైతుభరోసా ఎప్పటి వరకు ఇస్తరో చెప్పాలె
  • మాజీ మంత్రి జోగు రామన్న

హైదరాబాద్​: రైతుల సమస్యల పక్కన పెట్టి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి  కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ లో అడిగిన పత్తి విత్తనాలను ఇవ్వకుండ రైతులపై లాఠీ ఛార్జ్ చేశారని మండిపడ్డారు.  రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని, లేకుంటే  రైతులతో కలసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

రైతుల సమస్యల పక్కన పెట్టి తెలంగాణ రాజ ముద్రను మార్చే పనిలో  సీఎం రేవంత్ రెడ్డి  బిజీగా ఉన్నాడని,  ఉప ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కొత్త మద్యం టెండర్ల విషయం తనకు మద్యం మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడన్నారు. ట్యాక్స్ ల పేరుతో వసూల్ చేసిన డబ్బులను ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు.

 కాంగ్రెస్ వచ్చాక రైతుల పరిస్థితి ఆగమైందని, చెప్పులు, బట్టలు లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన ఆవేదన వ్యక్తం చేశారు.  పంట పొలాలు ఎండిపోయి 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.  రైతు భరోసా ఎప్పటి వరకు ఇస్తారో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.