
ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలన్నారు మాజీమంత్రి కడియం శ్రీహరి. హరీశ్ రావు దివాలా కోరు రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిపక్షాలు పగటి కలలు కనడం కాదు..రాష్ట్ర ప్రగతిలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.
జనగామ జిల్లాకు వస్తే.. ధాన్యం కొనుగోలుపై వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రయాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ బలోపేతానికి దోహద పడుతుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాలన్నారు కడియం శ్రీహరి.