కేటీఆర్​, హరీశ్ జనగామకు వస్తే..బోనస్​ సంగతి చెబుతం

కేటీఆర్​, హరీశ్ జనగామకు వస్తే..బోనస్​ సంగతి చెబుతం

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు : కేటీఆర్, హరీశ్​రావు వడ్ల బోనస్​ బోగస్​ అయిందని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. జనగామకు వస్తే సన్న వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రూ 500తో  రైతన్నల  సంతోషాలు తెలుస్తాయని, వారు ఇక్కడికి వస్తే బోనస్ సంగతి చెబుతమని ఆయన అన్నారు.  జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లోని క్యాంప్​ఆఫీస్​లో ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.18కోట్ల అభివృద్ధి పనుల  ప్రొసీడింగ్​లెటర్లను పార్టీ నేతలకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

కాంగ్రెస్​ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు. బీఆర్ఎస్​, బీజేపీ దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్​రాంబాబు, స్టేషన్ ఘన్​పూర్ మార్కెట్​​ చైర్ పర్సన్​ లావణ్య, వైస్​ చైర్మన్​ అయిలయ్య, కాంగ్రెస్​ జిల్లా నేతలు నరేందర్​రెడ్డి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.