మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  ఇంట్లో చోరీ

మాజీ మంత్రి ఇళ్లకు రక్షణ లేకుండా పోయింది.  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ లో చోరులు బీభత్సం సృష్టించారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. లక్షన్నర  రూపాయిలతో పాటు బంగారు ఆభరణాలను దొంగిలించారు. పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణా దేవి జరిగిన దోపిడీపై ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు