- లక్షన్నర నగదు, రూ.10 లక్షల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. బెడ్రూమ్లోని లక్షన్నర నగదుతోపాటు రూ.10 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వారం కింద జరిగిన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నం.92లో పొన్నాల లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల10న వీరు టీటీడీ ఆలయానికి వెళ్లి వచ్చారు. ఆ మరుసటి రోజు బెడ్రూమ్ అల్మరాలోని రూ.1.50 లక్షల నగదు, రూ.10 లక్షలు విలువైన బంగారు గాజులు, నెక్లెస్, ఇతర ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఈనెల 12న పొన్నాల సతీమణి అరుణాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.