ఫోన్​ ట్యాపింగ్​ లో బయటపడ్డ .. విషయాన్నే కొండా సురేఖ చెప్పారు: మాజీ మంత్రి రవీంద్ర నాయక్

ఫోన్​ ట్యాపింగ్​ లో బయటపడ్డ .. విషయాన్నే కొండా సురేఖ చెప్పారు: మాజీ మంత్రి రవీంద్ర నాయక్
  • ఫోన్​ ట్యాపింగ్​ లో బయటపడ్డ .. విషయాన్నే కొండా సురేఖ చెప్పారు
  • ఆమెపై నాగార్జున కేసు పెట్టడం తగదు

ఖైరతాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో ​రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నాడని మాజీ మంత్రి రవీంద్రనాయక్ విమర్శించారు. తెలంగాణ జనం సొమ్మంతా కేసీఆర్ వద్దే ఉందని, ఆయన అవినీతి కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో రవీంద్రనాయక్​మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ చేసిన అవినీతే ఆయన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిందని విమర్శించారు. ప్రతిపక్షంలోనూ ఫాంహౌస్​కే పరిమితయ్యాడన్నారు.

బీఆర్ఎస్​హయాంలో చేసిన ఫోన్​ట్యాపింగ్ లో బయటపడ్డ విషయాన్నే మంత్రి కొండా సురేఖ ఇటీవల చెప్పారని, ఆమెపై సినీ హీరో నాగార్జున కేసు పెట్టడం, కోర్టుకు వెళ్లడం తగదన్నారు. ఆ టైంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి ఏమి చేస్తున్నారని, ఫోన్​ ట్యాపింగ్​జరిగితే కేంద్ర ఇంటిలిజెన్స్​ వ్యవస్థ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి హైడ్రాతో కబ్జాలకు గురైన చెరువులను, కుంటలను రక్షిస్తుంటే.. కొందరు కావాలనే అడ్డుకుంటున్నారన్నారు. చెరువులు ప్రజల ఆస్తిని, వాటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. హైడ్రాను ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.