జైలు వద్ద సబితకు ప్రతికూల వాతావరణం.. దాంతో మాట మార్చిన మాజీ మంత్రి

జైలు వద్ద సబితకు ప్రతికూల వాతావరణం.. దాంతో మాట మార్చిన మాజీ మంత్రి

కలెక్టర్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన బాధిత కుటుంబాలని పరిగి సబ్ జైలులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి అసలు సూత్రదారి సురేశ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. సురేష్ అనే వ్యక్తికి పనిపాట లేకుండా తిరుగుతాడని, ఆయన హైదరాబాద్ లో ఉంటాడని చెప్పారు. అతడు చేసిన పనికి తమను బలి పశువులను చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సురేశ్ హైలైట్ కావడానికి ఇలా చేశాడని అన్నాడు. 

‘సురేశ్ కలెక్టర్ దగ్గరికి పోయి ఊర్లెకు రమ్మన్నడు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఇట్లనే దాడి జరిగింది. కలెక్టర్ వచ్చినప్పుడు వంద మంది  పోలీసులు వచ్చేదుండె.. కలెక్టర్ ఒక్కడే వచ్చేసరికి అంతా మీద పడ్డరు. యాదయ్య అనే వ్యక్తి తాగి ఉన్నడు. కలెక్టర్ కారు మీద బండతోటి కొట్టిండు..యాదయ్యకు జాగానే లేదు ఆవారా టైపు.. వాళ్లు చేయవట్టి మేం ఇరుక్కున్నం.. కలెక్టర్ పై దాడితోటి ఊరు ఊరంతా కంపు అయ్యింది. 

సురేశ్ 42 సార్లు నరేందర్ కు ఫోన్ చేసిండట. సురేశ్ కు భూమే లేదు. హైదరాబాద్ లో ఉంటడు.. ఊరికి వచ్చిపోతుంటడు.  సురేశ్ వల్ల మేం ఇబ్బంది పడుతున్నం..’ అని సబితా ఇంద్రారెడ్డితో చెప్పారు. అతని మాటలు తమకు అనుకూలంగా లేవనుకున్న మాజీ మంత్రి.. పక్కనే ఉన్న పిల్లాడిని ఎత్తుకొని టాఫిక్ డైవర్ట్ చేశారు.