దేశం కోసం బీఆర్ఎస్ : తుమ్మల

దేశ ప్రజల కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కరెంట్, తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పరిష్కారం చూపారని  వెల్లడించారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సన్నాహక సమవేశంలో సత్తుపల్లిలో జరిగింది. ఆ సభలో తుమ్మల మాట్లాడారు.  

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు. కొన్ని పార్టీలు మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.  జిల్లాల్లో నిర్వహించే ఈ సభ చరిత్రలో నిలవాలని ఆకాంక్షించారు.