ఉద్యమకారులతో పెట్టుకోవద్దు

కరీంనగర్ లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగె శోభ అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం శోభ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శోభ ఇంటికి వచ్చిన పోలీసులు తలుపులు కొట్టి మరి ఆమెను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై  మండిపడ్డారు. ఉద్యమ కారులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పక్షాన పోరాడతామన్నారు. ప్రభుత్వ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారామె. బీజేపీ జాగరణ దీక్షలో భాగంగా శోభపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

శోభ  అరెస్ట్ పై ఆమె భర్త స్పందించారు. తప్పుడు సెక్షన్లు పెట్టి పోలీసులు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. 333 చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆరోపించారు. పోలీసులపై బీజేపీ నేతలు ఎక్కడ దాడి చేశారని ప్రశ్నించారు. ఈ అరెస్టులకు కారణం కేటీఆర్ అన్నారు శోభ భర్త. మరోవైపు పలువురు బీజేపీ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే జైలులో ఉన్న బండి సంజయ్ సహా నలుగురు నేతలు ఉన్నారు. 

ఇవి కూడా చదవండి: 

బండి సంజయ్ క్రిమినల్ కాబట్టే.. పది కేసులు
‘రాధేశ్యామ్’ వాయిదా.. నిరాశలో డార్లింగ్ అభిమానులు