ఫోన్ ట్యాపింగ్ కేసు : మునుగోడు బైపోల్ వేళ రెండు ఫోన్ల ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసు : మునుగోడు బైపోల్ వేళ రెండు ఫోన్ల ట్యాపింగ్

= వేముల వీరేశం అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు రిపోర్ట్
= తిరుపతన్న, భుజంగరావు ద్వారా వ్యవహారం
= రాజకీయ కక్షతోనే నోటీసులు: చిరుమర్తి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్  నేత చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ను పోలీసులు విచారిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక  సమయంలో ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్లను తిరుపతన్న, భుజంగరావ్ ద్వారా ట్యాప్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ  కేసులో చిరుమర్తి ఇవాళ విచారణకు హాజరయ్యారు.

ALSO READ | మళ్లీ సవాల్ చేస్తోన్న.. ఈ రేస్ అయిన ఇంకేదైనా కేసులో అరెస్ట్ చేసుకోండి: కేటీఆర్

విచారణకు హాజరైన చిరుమర్తి మాట్లాడుతూ పోలీసులు అడిగిన  ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. రాజకీయ కక్షతోనే తనకు  నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. దళితుడిని కాబట్టే తనకు ముందుగా నోటీసులు ఇచ్చారని అన్నారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఏర్పాటును అడ్డుకున్నందుకు ఈ ప్రభుత్వం తనపై కక్షకట్టిందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా అధికారులతో ఫోన్లో మాట్లాడటం సర్వసాధారణమని అన్నారు. 

నల్లమోతుకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో సిట్ విచారణకు హాజరయ్యారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సిట్ అధికారులు విచారించారు.