పోలీసులతో సంబంధాలు ఉన్నాయి.. ట్యాపింగ్ తో సంబంధం లేదు : చిరుమర్తి లింగయ్య

పోలీసులతో సంబంధాలు ఉన్నాయి.. ట్యాపింగ్ తో సంబంధం లేదు : చిరుమర్తి లింగయ్య

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మొదటి రోజు విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారాయన. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు స్పష్టం చేసిన లింగయ్య.. కొంత మంది పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని.. సంబంధాలు ఉన్నాయని వివరించారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తిరుపతన్నతో ఫోన్ లో మాట్లాడిన విషయం.. తిరుపతన్న ఫోన్ కాల్ కాంటాక్ట్స్ విషయాలపై ప్రశ్నలు అడిగారని.. వాటికి సమాధానం చెప్పినట్లు వివరించారు లింగయ్య. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ విషయంపైనా ఆరా తీసినట్లు లింగయ్య మీడియాకు వివరించారు. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ రాజకీయంగా సంబంధం లేని వ్యక్తులని వెల్లడించారు లింగయ్య.

ALSO READ | రాష్ట్రంలో హీటెక్కిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంకొంత మందికి నోటీసులు!

గంటన్నరపాటు సాగిన విచారణ తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు చిరుమర్తి లింగయ్య. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని ఆదేశించారని.. పోలీసుల సూచనల మేరకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటూ మీడియా ఎదుట స్పష్టం చేశారు లింగయ్య.