జగన్ కు షాక్: కీలక నేత రాజీనామా..త్వరలోనే ఎన్డీయే కూటమిలోకి..

2024 ఎన్నికల్లో తగిలిన షాక్ నుండి ఇప్పుడిపుడే బయటపడుతున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి కీలక నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎన్డీయే కూటమితో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని అన్నారు.

పిఠాపురం నుండి రెండుసార్లు గెలుపొందిన దొరబాబు 2004లో బీజేపీ అభ్యర్థిగా, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.గత ఎన్నికల్లో తనకు కాదని వంగా గీతకు టిక్కెట్ ఇవ్వడం, ఆమె పార్టీ కార్యాలయాన్ని తమ సమీపంలోనే ఏర్పాటు చేయడంతో దొరబాబు అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పార్టీని వీడాలని భావించినప్పటికీ జగన్ బుజ్జగించటంతో ఆగిన ఆయన ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.