
మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కవిగా, రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా తనదైన ముద్ర వేశారు. 1972, 1989లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి సారి జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిపొందారు. రెండోసారి కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లోనూ జగపతిరావు పాల్గొన్నారు. ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. జగపతిరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.