సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో భారీ దోపిడీ జరిగిందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాట్ కామెంట్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు, గుండాటలు జరిగాయని, సంక్రాంతి పండుగకు కొత్త నిర్వచనం చెప్పారని అన్నారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కిందని.. గంజాయి, గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్సులు, కోడి పందాలు, మద్యం అమ్మకాలే ప్రస్తుత కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో అని సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని జక్కంపూడి సూచించారు. సంక్రాంతి సంబరాలు అంటే గంగిరెద్దులు, ముగ్గులు.. ఏదో అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవని, సంక్రాంతికి కొత్త నిర్వచనం చెప్పారని అన్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు, గుండాటలు జరిగాయని విమర్శించారు. గంజాయి, గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్సులు, కోడి పందాలు ప్రీమియర్ లీగ్ లా నిర్వహించి .. పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా వసూలు చేశారని విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని, ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు లొంగిపోయారని అన్నారు.