272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే

కరోనాతో చనిపోయినోళ్లను గౌరవంగా సాగనంపుతుండు

న్యూఢిల్లీ: కరోనాతో మరణిస్తున్న వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కుటుంబసభ్యులు క్వారంటైన్ లో ఉండడం, వారిని అంత్యక్రియలకు అనుమతించకపోవడం లాంటి కారణాలతో అందరూ ఉన్నా అనాథ శవాల్లా అధికారులే డెడ్ బాడీలను ఖననం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని షాహదారా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ షంటీ గొప్ప సేవ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలోని షాహీద్ భగత్ సింగ్ సేవాదళ్‌ (ఎస్బీఎస్ఎస్ డీ) కొన్ని నెలలుగా కరోనా మృతులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు చేస్తోంది. లోకల్ ఆఫీసర్లతో కలిసి ఇప్పటి వరకు 272 డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందుకు ఖర్చులన్నీ తామే భరిస్తున్నామన్నారు. ‘‘నాకు కరోనా రావడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాను. కొంతమంది స్టాఫ్ కు కూడా వచ్చింది. అయినప్పటికీ మా ఆర్గనైజేషన్ వర్క్ జరుగుతోంది” అని జితేంద్ర సింగ్ చెప్పారు. ఎన్జీఓ ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలందించడంతో పాటు కరోనా పేషెంట్లకు ఫుడ్ అందజేస్తున్నారు.

For More News..

ప్లేయర్ల కోసం చార్టెడ్‌ ఫ్లైట్స్‌.. హోటల్‌ బుకింగ్స్‌!

పేమెంట్స్‌ సొల్యూషన్స్‌లో ఫోన్ పే దూకుడు