చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఇన్ కం ట్యాక్స్ రైడ్స్ వెనక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. వివేక్ సంస్థలన్నీ టైం ప్రకారం.. అన్ని పన్నులు సక్రమంగా కడుతుందని.. ఆయన సంస్థలు అన్నీ సక్రమంగా నడుస్తున్నాయని.. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం ఐటీ పన్ను చెల్లించే ఏకైక వ్యక్తి వివేక్ వెంకటస్వామి అన్నారాయన.
అలాంటి వివేక్ వెంకటస్వామిపై ఐటీ రైడ్స్ వెనక రాజకీయ కక్ష ఉందన్నారాయన. చెన్నూరులో బాల్క సుమన్ ఓటమి ఖాయమని.. ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందన్నారు నల్లాల ఓదేలు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఓటర్లలో మార్పు రాదని.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారన్నారు. బాల్క సుమన్ అహంకారంగా వ్యవహరిస్తున్నాడని.. అతని చెన్నూరు ప్రజలే బుద్ధి చెబుతారన్నారాయన.
కుట్రలు, కుతంత్రాలు, అహంకారంతో ప్రజల మనసులను గెలవలేమని..బాల్క సుమన్ ను చెన్నూరు ప్రజలు ఓడించే రోజులు దగ్గర పడ్డాయన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. వివేక్ వెంకటస్వామికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారాయన.