మాజీమంత్రి స్వర్గీయ పరకాల శేషావతారం సతీమణి, మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ(94) కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచి రేవుల గ్రామంలో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కాళికాంబ.. జనవరి 3వ తేదీ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు కాళికాంబ అత్త వరుస అవుతుంది.
దీంతో ఆమె మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు.. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పరకాల కాళికాంబకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రభాకర్ కూడా నరసాపురం ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పోటీ చేసారు. ఓ టీవీ ఛానల్ లో ప్రాచుర్యం పొందిన ప్రతిధ్వని కార్యక్రమం నిర్వాహకులుగా కూడా ఆమె వ్యవహరించారు.