ప్రశ్నిస్తే కేసులు.. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది?: మాజీ ఎమ్మెల్యే రసమయి

హైదరాబాద్: రేవంత్​పాలన ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ లో ముగ్గురు మంత్రుల సాక్షిగా జరిగిన అరాచకాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. అసలు నిన్న జరిగిన మీటింగ్​లో కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు.

తెలంగాణ భవన్ లో రసమయి మీడియాతో మాట్లాడుతూ ‘ఆరు గ్యారెంటీలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. ఏ పార్టీ నుంచి ఆయన మాట్లాడుతున్నారని  కౌశిక్ రెడ్డి  అడిగాడు. దీనిపై ముగ్గురు మంత్రులకు అసహనం ఎందుకు? హామీలపై ఇద్దరు ఎమ్మెల్యేలు నిలదీస్తేనే అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్లు ప్రజలకు ఏం జవాబు చెప్తరు? ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. సంజయ్ సిగ్గు లేకుండా ఇంకా స్పీకర్ ను కలిశాడు. మా మౌనం చేతకానితనం అనుకోవద్దు’ అని అన్నారు.

ALSO READ | KCR క్షమాపణ చెబితే .. MLA పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే సంజయ్