
వరంగల్:మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చిన తరువాత జోష్ పెంచారు. ఇవాళ హనుమకొండ జిల్లా ఆఫీసులో వరంగల్ పార్లమెంట్ ఎన్ని కల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య మీటింగ్ లో డాన్స్ చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సంద ర్భం గా ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీహరికి సిగ్గు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక ల్లో ఇదే ఘన్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని కడియంకు రాజయ్య సవాల్ విసిరారు. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యనే అని స్పష్టం చేశారు. మన పోరాటం కోసం ఒక్క తెలంగాణనే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోందని రాజయ్య చెప్పారు.