వరంగల్: దళితులకు కూడా దళితబంధు అమలు చేయాలని.. లేకపోతే వందలారీల్లో జనాలను తీసుకెళ్లి హుజురాబాద్‌లో నామినేషన్ వేయిస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ అన్నారు. టీఆర్ఎస్ నేతలు అంతా కేసీఆర్‌కు ఊడిగం చేసేవారేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్లో దళిత నేతలకు సిగ్గుంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘2018లో కొండా సురేఖను ఓడించేందుకు కేసీఆర్ 500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. నేను కేసీఆర్ దగ్గరికి వెళ్లినప్పుడు బూట్లు విడవలేదని కక్ష కట్టాడు. వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు నా కాళ్ళు పట్టుకుని టికెట్ అడుక్కుని.. నాకాళ్లే లాగేశారు. హుజురాబాద్‌లో పోటీచేయాలని కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుతోందంటే మాపై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోండి’ అని కొండా మురళీ అన్నారు.