సమగ్ర శిక్ష ఉద్యోగులకుఎంటీఎస్ అమలు చేయాలి

సమగ్ర శిక్ష ఉద్యోగులకుఎంటీఎస్ అమలు చేయాలి
  • సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రభుతాన్ని కోరారు. వారిని పిలిచి చర్చించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ... కేజీబీవీ, గురుకులాలు, సింగరేణిలో పనిచేసే సీఆర్టీలకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్ టీచర్లకు ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు వచ్చేలా 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఆయనతో పాటు ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి కూడా ఉన్నారు.